Saturday, April 20, 2024

హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో ఇద్దరు ఆత్మహత్య

హైదరాబాద్ బేగంపేటలోని ఓ స్టార్‌ హోటల్‌లో ఓ యువతి, ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుదుచ్చేరికి చెందిన విజయకుమార్‌(34), శ్యామల దేవి(36) ఇద్దరూ కలిసి ఈ నెల 8వ తేది ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. ప్రతి రోజు గదికే ఆహారం ఆర్డర్ చేసుకునే వీరు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్‌ ఆర్డర్‌, రూమ్‌ సర్వీస్‌ గురించి ఫోన్‌ చేయలేదు. ఎంత ప్రయత్నించినా వారు తమ గది తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు హోటల్‌కు చేరుకుని హోటల్ సిబ్బంది సహాయంతో వారి గది తలుపులు తీయించారు. లోపలకు వెళ్లిచూడగా అక్కడ ఇద్దరు విగత జీవులై పడిఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కనే తమిళంలో రాసిన సూసైట్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో గతంలోనే వారిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిగినట్లు తెలిసింది. వివాహం జరిగినా ఇద్దరు విడిగా ఉండలేకపోయారని, వివాహేతర సంబంధమే వీరిద్దరి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement