Monday, May 6, 2024

ఒకేసారి రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-ఆనందంలో సాయిప‌ల్ల‌వి

హీరోయిన్ సాయిప‌ల్ల‌వి న‌టించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలలో నటనకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఆమె రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి షేర్ చేశారు. ఒకేసారి రెండు అవార్డ్స్ అందుకునే ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. దీనికి కారణమైన శేఖర్ కమ్ముల, రాహుల్ సంకీర్త్యన్ లకు, చిత్ర నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు నా కృతఙ్ఞతలు.. అంటూ సాయి పల్లవి ఇంస్టాగ్రామ్ లో స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement