Monday, May 6, 2024

కోవిడ్ పై పోరు: భారత్‌కు ట్విటర్‌ భారీ విరాళం

 కరోనాపై భారత్‌ చేస్తోన్న పోరులో ట్విటర్‌ భారీ విరాళాన్ని కేటాయించింది.ట్విట్టర్ అధినేత జాక్ పాట్రిక్ డోర్సే సుమారు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్ల) విరాళాన్ని భారత్‌కు అందిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. భారత్‌లో కోవిడ్‌-19 ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు  ఎన్జీవో సంస్థలకు విరాళాన్ని అందించాడు. ఈ విరాళాన్ని  కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విటర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. కేర్‌ స్వచ్చంద సంస్థకు 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషన్‌ యూఎస్‌ఏలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళాన్ని కేటాయించాడు. ఈ విరాళాలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రెటర్‌లు, వెంటిలేటర్‌లు, ఇతర మెడికల్‌ సౌకర్యాలను భారత్‌కు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement