Monday, April 29, 2024

TS | రుణమాఫీ చేస్తాం.. అధైర్యపడోద్దు: సీఎం రేవంత్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభ నిర్వ‌హించింది. ఈ స‌భ‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేస్తామని ఆయన చెప్పారు. రైతులు అధైర్య పడొద్దు.. ఆగస్టు కల్లా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల అయిపోయిన తర్వాత నారాయణపేటలో అండర్ గ్రౌండ్ డ్రేనేజిని తీసుకొస్తామ తెలిపారు.

15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా…

దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్లకు కేసిఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముదిరాజ్లను బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం అని హామీ ఇచ్చారు. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా’ అని ప్రకటించారు.ఆగస్ట్ 15 తారీకు లోపల రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement