Wednesday, May 29, 2024

TS | జయశంకర్ జిల్లాపై ఐజీ రంగనాథ్ స్పెషల్ నజర్

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న సంఘటనలపై మల్టీ జోన్ 1 ఐజి రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసుల పనితీరు పై వస్తున్న ఆరోపణలు తన దృష్టికి వెళ్లిన వెంటనే తక్షణమే స్పందిస్తూ బాధ్యులపై శాఖ పరమైన చర్యలకు అదేశిస్తున్నారు. ఇటీవల మొగుళ్లపల్లిలో ఓ రౌడి షీటర్ జన్మదిన వేడుకలు ఠాణాలో జరుపగా వెంటనే స్పందించి సంబంధిత ఎస్సై పై శాఖాపరమైన చర్యలు చేపట్టి ఆసిఫాబాద్ జిల్లాకి బదిలి చేశారు.

తాజాగా సోమవారం మహాదేవ పూర్ లో జరిగిన ఘటనపై స్పందించి సంబంధిత ఎస్సై ప్రసాద్ ను విఆర్ కు బదిలీ చేయగా , హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో వున్న మరో 7గురి ఒక హెడ్ కానిస్టేబుల్ పాటు మరో ఆరుగురి సిబ్బంది పై బదిలి వేటు వేశారు. దీంతో జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది. ఐజి తీసుకుంటున్న శాఖ పరమైన చర్యలతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement