Thursday, May 9, 2024

TS : ప్రేమ జంట ఆత్మహత్య

ఆత్మకూర్ (ఎస్), ప్రభ న్యూస్ః క్షణికావేశంలో ప్రేమ జంట తీసుకున్న తొందరపాటు నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు( ఎస్) మండలంలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్(25) చదువు పూర్తి చేసుకొని సూర్యాపేటలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సల్లగుండా నాగజ్యోతి(21) ఫార్మసీ పూర్తి చేసుకొని హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఫార్మసీస్ట్ గా పని చేస్తుంది. వీరిద్దరూ గత అయిదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు పక్షాల పెద్దలు అంగీకరించ లేదు.

గతంలో సంజయ్​కు అమ్మాయి తరుపున బంధువులు తమ అమ్మాయి జోలికి రావొద్దని మందలించారు. ఈ తరుణంలో నెల రోజుల క్రితం ఘర్షణ జరిగింది. దీంతో నాగలక్ష్మి ఉగాది పండుగ సందర్భంగా గ్రామనికి వచ్చి ఉంటుంది. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షణికావేశంలోనే శనివారం రాత్రి ఇద్దరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. దాంతో యువతీయువకుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement