Sunday, May 19, 2024

TS : ఇవాళ మేడిగ‌డ్డ‌కు జ‌స్టీస్‌చంద్ర‌ఘోష్‌

ఇవాళ మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో దెబ్బతిని, కుంగిపోయిన పియర్లను జ్యుడిషియల్ కమీషన్ చైర్మన్ పరిశీలించనున్నారు.

- Advertisement -

మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం రామగుండంలోని విశ్రాంతి గృహంలో రాత్రి బస చేయనున్నారు. కలకత్తా నుంచి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులతో సమావేశమయ్యారు. మే 9వ తేదీన బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖతో మరోసారి సమావేశం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement