Friday, May 17, 2024

కరోనా ఆంక్షల ఎఫెక్ట్: 31 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాటపట్టగా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. దీంతో జనం బయటకు రావడం లేదు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ ప్రభావం రైల్వే శాఖపై తీవ్రంగా పడింది. సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌, దురంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా పెద్ద ఎత్తున రైళ్లు రద్దయ్యాయి. తాజాగా ఈశాన్య సరిహద్దు రైల్వే 31 రైళ్లను బుధవారం రద్దు చేసింది. పలు రైళ్లు బుధవారం నుంచి, మరికొన్ని ఈ నెల 13, 14, 15 నుంచి రద్దవుతాయని పేర్కొంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైళ్లు నడవవని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement