Saturday, April 27, 2024

టమాట@80.. రోజురోజుకు పెరిగిపోతున్న ధర

ప్రభన్యూస్ : రోజురోజుకు టమాట ధర పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో హోల్‌సెల్‌గా రూ.70 వరకు విక్రయిస్తుండ‌గా రిటైల్ గా రూ.80 పలుకుతుంది. గత నెల 15వ తేదీ నాటికి వ్యాపార తులు కిలో 15 చొప్పున విక్రయించారు. నెల రోజుల వ్యవధిలో ధర అమాంతం పెరిగి రూ. 80కి చేరడం విశేషం దీంతో సామాన్య మద్య తరగతి వినియోగదారులు కొనలేని పరిస్థితి నెల కొంది. వేసవి నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలకు మొక్కలు కాపాడుకోవడం కష్టంగా మారడంతో రైతులు సాగుతగ్గించారు.

దీంతో జిల్లాలో దిగుబడి తగ్గింది ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతోపాటు ఫంక్షన్‌లోను టమాట వినియోగం పెరిగింది. దీనికితోడు సరిపడా సరఫరా లేకపోవడంతో ధర రోజు రోజుకు పెరిగిపోతుంది ఇతర కూరగాయల ధరలు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement