Friday, May 3, 2024

Follow up | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో సూచీలు ఉదయం నుంచే లాభాల్లో ట్రేడయ్యాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ధేశించిన 6 శాతం కంటే తక్కువ నమోదు కావడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. చివరకు మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్‌ 402.73 పాయింట్ల లాభంతో 62533.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 110.85 పాయింట్ల లాభంతో 18608 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 503 రూపాయలు పెరిగి 54635 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 1038 రూపాయలు పెరిగి 68824 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.43 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు :

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎం అండ్‌ ఎం, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు :

టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, మారుతి సుజుకీ, టైటాన్‌ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఐచర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, హీరో మోటో కార్ప్‌, బీపీసీఎల్‌, ఆపోలో ఆస్పటల్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement