Saturday, April 20, 2024

16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ఎన్‌. గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 జనవరి 15వ తేదీ వరకు 30 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

ప్రతి రోజు ఉదయం 4.30 నుంచి 5.15 గంటల వరకు ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం వైభవంగా జరుపుతామని, ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఓడి బియ్యం కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు పరిసమాప్తం పలుకుతారని ఆమె వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement