Tuesday, April 23, 2024

ఒడిశా రైలు ప్రమాదం కేసులో ముగ్గురు అరెస్టు.. అందులో ఇద్దరు ఇంజనీర్లు

292 మంది ప్రయాణికులను పొట్టనపెట్టుకున్న ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదానికి సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. బాలాసోర్‌లో సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరుణ్‌ కుమార్‌ మహంతా, సోరో సెక్షన్‌ ఇంజనీర్‌ మహమ్మద్‌ అమీర్‌ ఖాన్‌, బాలాసోర్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పప్పూ కుమార్‌ను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ అరెస్టు చేసిందని సీబీఐ అధికారులు తెలిపారు. ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement