Friday, May 3, 2024

ఈ చిన్నారి భ‌లే ల‌క్కీ -ఐదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డ‌కుండా క్యాచ్ ప‌ట్టిన భార్య‌భ‌ర్త‌లు

అదృష్ట‌మంటే ఈ చిన్నారిదే. ప్ర‌మాద‌వ‌శాత్తు ఐదో అంత‌స్తు నుంచి కింద‌కి ప‌డిపోబోయింది రెండేళ్ల చిన్నారి. దాంతో ఓ ఇద్దరు వ్య‌క్తులు వచ్చి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో చోటు చేసుకుంది.
షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అదే సమయంలో పెద్దగా కేకలు వినిపించాయి. పక్కగా చూస్తే ఎత్తయిన భవనం (ఐదో అంతస్తు) కిటికీ నుంచి ఓ చిన్న పాప కిందకు జారి పడిపోతోంది. దీంతో షెన్ డాంగ్, అతడి భార్య వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చి రెండు చేతులు చాచి పాపను పట్టుకున్నారు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా ఆ చిన్నారి ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడి నుంచి క్షణాలలో మళ్లీ కిందకు జారింది. పెద్దగా కేకలు వేయడం, వాటిని విన్న షెన్ డాంగ్ దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి. దీంతో షెన్ డాంగ్ నిజమైన హీరో అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన హీరోలు సినిమాల్లోకాదు, నిజ ప్రపంచంలోనే ఉంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement