Tuesday, April 30, 2024

రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ, వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అనంతపురంలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి ఉక్కపోత తోడవ్వడంతో ప్రజలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

ఆదివారం తిరుపతిలో అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 36.8, అనంతపురంలో 34.9, కడపలో 36.2, కాకినాడలో 34.6, కళింగపట్నంలో 33.2, కర్నూలులో 33.4, మచిలీపట్నంలో 35.1, ఒంగోలులో 36.1, నందిగామలో 34.1, గన్నవరంలో 35.2, జంగమేశ్వరపురంలో 35.0, కావలి 35.8, బాపట్ల 35.6, నర్సాపూర్‌ 34.2, తునిలో 36.1,నంధ్యాల 35.5, ఆరోగ్యవరంలో 32.0 సెంటీగ్రేడ్‌మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement