Thursday, October 10, 2024

ఏపీలో కొత్తగా 22 వేల కేసులు… 98 మంది మృతి

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24గంట‌ల్లో మొత్తం 89,535 కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా…. 22,517 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు గడిచిన 24 గంటల్లో 98 మంది చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,07,467యాక్టివ్ కేసులు ఉండగా కొత్త‌గా 18,739 క‌రోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

అలాగే కొత్తగా చనిపోయిన వారిలో అనంతపురంలో 12, నెల్లూరులో 11 ,తూర్పు గోదావరిలో 10 ,విశాఖపట్నం లో 9, విజయనగరంలో 9, చిత్తూరులో 8 ,శ్రీకాకుళంలో 8, గుంటూరు ఏడుగురు ,పశ్చిమ గోదావరి ఏడుగురు, కృష్ణా ఐదుగురు, కర్నూలు ఐదుగురు, ప్రకాశం ఐదుగురు, కడప లో ఇద్దరు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement