Friday, June 14, 2024

భీమ్లా నాయ‌క్ కి సీక్వెల్ ఉండ‌క‌పోవ‌చ్చు – హీరో రానా

సాగ‌ర్ కె చంద్ర డైరెక్ష‌న్ లో రూపొందిన చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉండ‌క‌పోవ‌చ్చ‌నేది నా అభిప్రాయ‌మ‌ని రానా వెల్ల‌డించాడు. ఈ సినిమా ఎక్క‌డ మొద‌లై..ఎక్క‌డ ముగింపు తీసుకోవాలో అక్క‌డే ముగించార‌ని తెలిపాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చాడు. తమన్ బాణీలను అందించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాలో ‘డేనియల్ శేఖర్’ పాత్రలో రానా నటించాడు. ఈ పవర్ఫుల్ పాత్రలో ఆయన పవన్ తో పోటీ పడుతూ మెప్పించాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇంతకాలానికి రానాకి సరైన పాత్ర పడిందని టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement