Monday, April 29, 2024

టెస్ట్ లు పెరగలే…కేసులు పెరగలే – తెలంగాణలో కొత్త కేసులెన్నో తెలుసా ?

తెలంగాణ లో ఏ మాత్రం కరోనా టెస్ట్ లను పెంచటం లేదు. గడిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో కొత్తగా 69,252 మందికి క‌రోనా టెస్ట్ లు చేయగా 3,660 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే క‌రోనా కార‌ణంగా 23 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5.44 ల‌క్ష‌ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 4.95 ల‌క్ష‌ల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కరోనా తో రాష్ట్రంలో 3,060 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణ‌లో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement