Monday, April 29, 2024

దేశంలో 20 నకిలీ వర్సిటీలు.. ఢిల్లీలోనే అధికం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించింది. ఏ డిగ్రీ సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు ఆయా విశ్వవిద్యాలయాలకు ఎటువంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువగా నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్టు యూజీసీ గుర్తించింది.

ఢిల్లీలో నకిలీ వర్సిటీలు మొత్తం ఎనిమిది ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు ఉన్నాయని యూజీసీ తెలిపింది. యూజీసీ చట్టానికి విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ పేర్కొంది. అటువంటి విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీలకు గుర్తింపు ఉండబోదని, ఉన్నత విద్య, ఉద్యోగాలకు అవి చెల్లబోవని యూజీసీ కార్యదర్శి మనీశ్‌ జోషి తెలిపారు.

ఢిల్లిలో నకిలీ యూనివర్సిటీలు

1) ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ఫిజికల్ హెల్త్‌ సైన్సెస్‌
2) కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌-దర్యాగంజ్‌
3) యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ
4) వొకేషనల్‌ యూనివర్సిటీబీ
5) ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ
6) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
7) విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌
8) ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

ఉత్తరప్రదేశ్‌లో ..

1) గాంధీ హిందీ విద్యాపీఠ్‌
2) నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి
3) నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ)
4) భారతీయ శిక్షా పరిషత్‌

ఇతర రాష్ట్రాల్లో..

1) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ (బెంగాల్‌)
2) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చి (బెంగాల్‌)
3) బదగాన్వి సర్కార్‌ వరల్డ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీ (కర్ణాటక)
4) సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ (కేరళ)
5) రాజా అరబిక్‌ యూనివర్సిటీ(మహారాష్ట్ర)
6) శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హ‌య్యర్‌ ఎడ్యుకేషన్‌(పుదుచ్ఛేరి)

Advertisement

తాజా వార్తలు

Advertisement