Sunday, May 5, 2024

ది ఘోస్ట్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మేక‌ర్స్

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టిస్తోన్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్ర‌ ట్రైల‌ర్‌ను ఆగ‌స్టు 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ద‌స‌రా కానుకుగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది.శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పటి నుండి ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఇటీవ‌లే విడుద‌లైన యాక్ష‌న్ ప్రోమోకు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ట్రైల‌ర్ డేట్‌ను ప్ర‌క‌టించారు. కాగా నాగార్జున, సోనాల్ చౌహ‌న్ చేతిలో గ‌న్స్ ప‌ట్టుకుని హ‌గ్ చేసుకున్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో నాగార్జున ఇంట‌ర్‌పోల్ ఆఫిస‌ర్‌గా క‌నిపించనున్నారు. నాగార్జున‌కు జోడీగా సోనాల్ చౌహ‌న్ న‌టిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement