Sunday, May 19, 2024

ఎంవోయూపై థియేటర్ల యాజమాన్యాలు అభ్యంత‌రం-సీఎం జ‌గ‌న్ కి ఫిల్మిం ఛాంబ‌ర్ లేఖ‌

సినిమా టికెట్ల అమ్మ‌కాల‌కు సంబంధించి నెల రోజుల్లో ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు షాక్ అయ్యారు. టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించడం వరకు బాగానే ఉన్నప్పటికీ… టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

ఎంవోయూపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలను జరుపుతామని ఎగ్జిబిటర్లు కోరారు. మరోవైపు ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వం చేతుల్లో చిక్కుకున్నట్టేనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే… జులై 2లోగా ఎంవోయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ సంతకాలు చేయబోమని, థియేటర్లు మూసివేసేందుకు కూడా సిద్ధమేనని థియేటర్ యజమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement