Sunday, May 5, 2024

Engagement | వెంకీ మామ ఇంట్లో పెళ్లి బాజాలు.. రెండో కుమార్తె నిశ్చితార్ధం

వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ కు ముగ్గురు కూతుళ్లు. ఇప్పటికే పెద్ద కూతురు అశ్రిత పెళ్లి జైపూర్‌లో కన్నుల పండువగా జ‌రిపించారు. ఇక‌, ఇప్పుడు వెంకటేష్ రెండో కూతురు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతుంది. వెంక‌టేష్ రెండో అమ్మాయి హయవాహిని దగ్గుబాటికి వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. రేపు హయవాహిని నిశ్చితార్థం జరగనుంది. దీంతో ఆ ఇంట పెళ్లి వాతావరణం త్వరలో మొదలు కానున్నట్లు సమాచారం..

వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని పెళ్ళికి సిద్ధమైంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంక‌టేష్‌ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement