Friday, May 3, 2024

రేటు ఎంతైనా స‌రే త‌గ్గేదే లే.. ప్రీమియం ఫోన్లపైనే భారత‌ వినియోగదారులు క‌న్ను

సాధారణంగా దేశంలో బడ్జెట్ రేంజ్ లోనే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుతం ఆ రోజులు క‌నిపించ‌డం లేదు.. ప్రైజ్ ఎంతైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపైనే ఇంట్రేస్ట్ చూపిస్తున్నారు వినియోగ‌దారులు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. అయితే గత సంవత్సరంలో మొబైల్ మార్కెట్లో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు… వినియోగదారుల మొదటి ఆప్షన్‌గా మారాయి.

తాజాగా మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ దీనికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతీయ వినియోగదారులు క‌నీసం రూ.లక్ష కంటే ఎక్కువ ధర గల ఫోన్లను చాలా ఇష్టపడుతున్నారని పేర్కొంది. వీటిలో ఐఫోన్, ఫోల్డ్, ఫ్లిప్, వంటి సిరీస్‌లు ఉన్నాయి. కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం.. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

దీంతో ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ఏకంగా 112 శాతం పెరిగాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్, ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్‌లు ప్రజల మొదటి ఆప్షన్లుగా మారాయి. మరోవైపు లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫోన్లను కొనుగోలు చేసే వారి సంఖ్య 8 శాతం పెరిగింది. అందుకే ఒప్పో, టెక్నో, వివో వంటి కంపెనీలు కూడా తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడం ప్రారంభించాయి.

మార్కెట్‌లో ప్రీమియం ఫోన్‌లకు డిమాండ్ పెరిగిన తర్వాత శాంసంగ్, ఒప్పో, టెక్నో కంపెనీలు తమ ఫోల్డ్, ఫ్లిప్ ఫోన్‌లను కూడా విడుదల చేయడం ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీలు బడ్జెట్ ఫోన్‌లను మాత్రమే విడుదల చేసేవని. దీని కారణంగా బడ్జెట్ విభాగంలో స్మార్ట్‌ఫోన్లకు పోటీ చాలా ఎక్కువగా ఉండేది. ఈ కంపెనీలు ఇప్పుడు ప్రీమియం విభాగంలో కూడా ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement