Monday, May 6, 2024

హిజాబ్‌ పిటిషన్‌ విచారణకు సుప్రీం ఓకే.. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం

కర్నాటకలో సంచలన వివాదానికి దారితీసిన హిజాబ్‌ అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తంచేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు మంగళవారం అంగీకరించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా ఈ విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని సీజేఐ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ఈ పిటిషన్‌ను జాబితా చేస్తామని చెప్పారు. రెండు రోజులు వేచివుండాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

దీనిని సవాల్‌చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. స్కూల్‌ యూనిఫాం ప్రిస్కిప్షన్‌ అనేది ఒక సహేతుకమైన పరిమితి మాత్రమేనని, రాజ్యాంగబద్ధంగా అనుమతించదగినదేనని, దీనికి విద్యార్థులు అభ్యంతరం చెప్పజాలరని హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా మతస్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ అనే ద్వంద్వాన్ని సృష్టించిన పిటిషన్‌ను కోర్టు తప్పుబట్టింది. మతాన్ని అనుసరించే వారికి మనస్సాక్షి హక్కు ఉండదని కోర్టు భావించింది. 5 ఫిబ్రవరి 2022 నాటి ఆర్డర్‌ సహేతుకమేనని, ఆ అధికారం ప్రభుత్వానికి ఉందని, దాని చెల్లుబాటు కోసం ఎలాంటి కేసు పెట్టడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement