Monday, April 29, 2024

బేర్‌ జోరు.. వరుసగా మూడోరోజూ నష్టాలే.. సెన్సెక్స్‌ 575 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్లపై బేర్‌ పట్టు బిగించింది. దీంతో వరుసగా మూడో రోజూ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు శుక్రవారం ఆర్బీఐ సమీక్ష నిర్ణయాలు వెలువడనుండటం ఇన్వెస్టర్లుపై ప్రభావం చూపింది. సెన్సెక్స్‌ అత్యధికంగా 575పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 17,700 దిగువకు పతనమైంది. కాగా అంతర్జాతీయ మార్కెట్ల వ్యతిరేక పవనాలతో సూచీలు ఆరంభంలోనే డీలా పడ్డాయి. 59,402 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఓ దశలో 59వేల మార్కు దిగువకు పడిపోయింది. మార్కెట్‌ ముగిసేనాటికి 575.46పాయింట్లు పడిపోయి 59,034.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 168.10 పాయింట్ల నష్టంతో 17,639.55వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ పతనమై 75.96వద్ద స్థిరపడింది. ఫార్మా రంగాన్ని మినహాయిస్తే దాదాపు అన్నిరంగాల షేర్లు ఒడుదొడుకులును ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అదానీ పోర్ట్స్‌, టైటాన్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల పాలవగా, యాక్సిస్‌ బ్యాంక్‌, దివీస్‌ బ్యాంక్‌, ల్యాబ్స్‌ హిందుస్థాన్‌ యునిలివర్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఐసీఐసీఐ షేర్లు లాభపడ్డాయి.

బీఎస్‌ఈ 30లో లాభపడిన ఐదు స్టాక్స్‌ను పరిశీలిస్తే యాక్సిస్‌ బ్యాంక్‌ 2.38, ఐసీఐసీఐ బ్యాంకు 1.12, హెచ్‌యూఎల్‌ 1.09, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 1.03, ఎంఅండ్‌ఎం 0.82శాతాన్ని లాభాన్ని ఆర్జించాయి. మరోవైపు టైటాన్‌ కంపెనీ 3.24శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.91, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.19, విప్రో 2.13శాతం, టీసీఎస్‌ 1.90శాతం మేరకు నష్టపోయాయి. కాగా ద్వైమాసికి ద్రవ్య పరపతి విధానంపై శుక్రవారం భారతీయ రిజర్వుబ్యాంకు ప్రకటన చేయనుంది. వడ్డీరేట్లపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సందేహాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరాకాలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచడం ఖాయమన్న ఊహాగానాలతో రూపాయి బలహీపడింది. డాలరుతో పోల్చితే 22పైసలు తగ్గి రూ.75.97గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర 1.71శాతం పెరిగి 102.8డాలర్లకు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement