Sunday, May 12, 2024

Ayodhya | డిసెంబరుకు రామ దర్బారు పూర్తి.. 10 నుంచి రెండో దశ పనులు

అయోధ్య: యూపీలోని అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వీరికి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రామ మందిర ట్రస్టు నిరంతరం ప్రయత్నిస్తోంది. తాజాగా రామమందిరం ట్రస్టుకు చెందిన భవన నిర్మాణ సమితి సమావేశమయ్యింది. దీనిలో మందిర నిర్మాణంపై చర్చ జరిగింది. బాలరాముడు ఆలయంలో కొలువుదీరిన తరువాత రెండవ దఫా పనులు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవం జరిగేలోగానే 25 వేల మంది భక్తులకు వసతి సౌకర్యాలను అందించే భవన నిర్మాణం పూర్తికానుంది.

మొదటి అంతస్థులో రామ దర్బారు నిర్మింతం కానుంది. దీని నిర్మాణం 2024 నాటికి పూర్తి కానుంది. అదేవిధంగా మందిరం నలువైపులా ప్రాకారాలను 2024 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలయంలోని కింది ఫ్లోర్‌లోని వేదికల వద్ద ఎకనోగ్రఫీ మాధ్యమంలో రాళ్లపై శిల్పాలు చెక్కే పని జరుగుతోంది. దీనితోపాటు మందిర పరిసరాల్లో సప్తమండపం కూడా రూపొందుతోంది. ఆలయ సముదాయంలో మరో మండపం నిర్మితం కానుంది. దానిలో రామాయణంలోని పాత్రలో కూడిన చిన్నపాటి ఆలయాలు నిర్మితం కానున్నాయి. నూతన రామాలయం ప్రారంభించినది మొదలు కొన్ని లక్షల మంది భక్తులు శ్రీరాములవారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement