Thursday, April 25, 2024

5 శాతం కుబేరుల చేతిలో 61.7 శాతం సంపద.. ధనికులు మరింత ధనిలుగా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పేదలు

మన దేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు. మన దేశంలో టాప్‌ 5 శాతంగా ఉన్న అపకుబేరుల వద్ద మొత్తం దేశ సంపదలో 61.7 శాతం ఉంది. దేశ జనాభాలో 50 శాతం మంది సంపద కంటే అపరకుబేరులుగా ఉన్న 1 శాతం మంది వద్ద ఉన్న సంపద 13 రేట్లు ఎక్కువగా ఉంది. ప్రముఖ ఎన్‌జీవో సంస్థ ఆక్సి ఫామ్‌ విడుదల చేసిన నివేదికలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌, ది ఇండియా సప్లిమెంట్‌ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది.

ధన వంతులు సంపద పైపైకి…

దేశంలో 1981 నుంచి 2012 మధ్య కాలంలో దేశం మొత్తం సంపదలో టాప్‌ 10 శాతం వాటా 45 నుంచి 63 శాతానికి పెరిగింది. అదే సమయంలో దిగువన ఉన్న 50 శాతం మంది సంపద సగానికి పైగా పడిపోయింది. పన్నుల భారం కూడా పెదలపైనే స్థిరంగా పెరుగుతూ వస్తోంది. టాప్‌ 10 శాతం, మధ్య తరగతి 40 శాతం మంది కలిపి చెల్లిస్తున్న పరోక్ష పన్నుల కంటే దిగువ ఆదాయం ఉన్న 50 శాతం మంది చెల్లిస్తున్న పరోక్ష పన్నులే ఎక్కువగా ఉన్నాయి. నివేదిక అత్యధిక ధనికులు, మధ్య తరగతి, అతి తక్కవ ఆదాయం గ్రూప్‌లుగా విభజించింది. టాప్‌10లో ఉన్న కుబేరులు తమ ఆదాయంలో చెల్లిస్తున్న పన్నులు, మిగిలిన వారు చెల్లిస్తున్న దాని కంటే చాలా తక్కువగా ఉంది. దిగువన ఉన్న 50 శాతం మంది మొత్తం జీఎస్టీ ఆదాయంలో 64 శాతం చెల్లిస్తున్నారు. ఇక టాప్‌ 10లో ఉన్న అపర కుబేరులు జీఎస్టీ ఆదాయంలో కేవలం 4శాతం మాత్రమే చెల్లిస్తున్నారు.

- Advertisement -

టాప్‌ 10 మంది ధనికులు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల కంటే దిగువన ఉన్న 50 శాతం మంది 6 రేట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు.
ఆదాయంలో దిగువన ఉన్న 50 మంది ప్రజలు తమ ఆదాయంలో ఆహారం, ఇతర వస్తువుల కొనుగోలుపై 6.7 శాతం పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. మధ్య తరగతిలో ఉన్న 40 శాతం మంది వీటి కొనుగోలు పై పన్నుల రూపంలో తమ ఆదాయంలో 3.3 శాతం చెల్లిస్తున్నారు. ఇక టాప్‌ 10లో ధనికులు మాత్రం వీటిపై వీటిపై తమ ఆదాయంలో కేవలం 0.4 శాతం మాత్రమే పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని నివేదిక తెలిపింది. కొవిడ్‌ తరువాత ధనికులు మరింత ధనికులుగా ఎదిగారని, పేదలు, మధ్య తరగతి వారి పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది.

కొవిడ్‌ తరువాత మరింత సంపద

ఇండియాలో ఉన్న టాప్‌ 5 శాతం మంది కుబేరుల సంపద కొవిడ్‌ తరువాత పెరుగుతూనే ఉంది. మొత్తం దేశ సంపదలో వీరు 62 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇది కొవిడ్‌ కంటే ముందున్నదాని కంటే చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది.
దేశం ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంక్షోభం వంటి అనేక సంక్షోభాలతో సతమతమవుతుంటే, బిలియనీర్లు తమ సంపదను వేగంగా పెంచుకోకలిగారు. అదే సమయంలో ఈ సంక్షోభాలతో ని రుపేదులు కనీస అవసరాలను సైతం సమకూర్చులేకపోతున్నారని ఆక్స్‌ఫామ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అమితాబ్‌ బెహర్‌ చెప్పారు. దేశంలో ఆకలితో ఉన్న వారి సంఖ్య 2018లో 190 మిలియన్ల నుంచి 2022 నాటికి 350 మిలియన్లకు పెరిగిందని చెప్పారు. అసమానతలు ప్రాంతాన్ని బట్టి, స్త్రీ, పురుష బేధాన్ని బట్టి, కులాన్ని బట్టి తేడాలు ఉన్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 5-0 శాతం పేదల కంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 50 శాతం మంది పేదులు చెల్లిస్తున్న పన్నులు 3 శాతం

అధికంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 2018 నుంచి 2019 సంవత్సరాల మధ్యలో స్త్రీ, పురుషుల సంపాదనలోనే తేడాలు ఉన్నాయి. పురుషులు సంపాందిచే ప్రతి రూపాయలో స్త్రీలు కేవలం 63 పైసలు మాత్రమే సంపదిస్తున్నారు. గ్రామాల్లో పని చేస్తున్న ఎస్‌సీ వర్కర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో కార్మికులు ఒక రూపాయి సంపాదింస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న షెడ్యూల్‌ కులాల వర్కర్లు కేవలం 55 పైసలు మాత్రమే సంపాదించకలుగుతున్నారు.

ధనికులపై పన్నులతో…

మన దేశంలో మొత్తం సంపదలో 40 శాతం కేవలం 1 శాతం ధనికుల వద్దే ఉంది. అట్టడుగున్న ఉన్న 50 శాతం జనాభా చేతిలో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉంది. మన దేశంలో తొలి 100 మంది బిలియనీర్లపై 2.5 శాతం లేదా మొదటిఇ 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే బడి మానేసిన పిల్లలందరినీ తిరిగి స్కూల్‌ చేర్పించవచ్చు. 2017-21 మధ్య పెరిగిన గౌతం అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో 1.79 లక్షల కోట్ల నిధులను సమీకరించవచ్చు. ఇది దేశంలో ప్రాథమిక పాఠశాలల్లో కావాల్సిన 50 లక్షల మంది టీచర్లకు ఏడాది పాటు వేతనాలు ఇవ్వడానికి సరిపోతుంది. దేశంలోని బిలియనీర్లపై ఒకసారి 2 శాతం పన్ను విధిస్తే 40,423 కోట్ల ఆదాయం వస్తుందని నివేదిక తెలిపింది. ఈ డబ్బుతో దేశంలో పౌషికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ మూడు సంవత్సరాల పాటు పోషకాహారం అందించవచ్చు. దేశంలోని టాప్‌ 10 మంది సంపన్నులపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే .137 లక్షల కోట్లతో 2022-23 సంవత్సరానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 86,200 కోట్లు, ఆయూష్‌ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన 3,050 కోట్ల నిధుల కంటే ఇది 1.5 శాతం ఎక్కువ.

కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్‌ వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121శాతం పెరిగింది. రోజుకు వీరి సంపద 3,608 కోట్లు పెరుగుతూ వచ్చింది. మన దేశంలో 2020లో బిలియనీర్ల సంఖ్య 102 ఉంటే, 2022 నాటికి వీరి సంఖ్య 166కి పెరిగింది. దేశంలోని 100 మంది బిలియనీర్ల మొత్తం సంపద 54.12 లక్షల కోట్లకు పెరిగింది. ఈ సంపదతో కేంద్ర బడ్జెట్‌కు 18 నెలల పాటు నిధులను సమకూర్చవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన బిలియనీర్ల సంపద

ప్రపంచ వ్యాప్తంగా ఒక శాతం కుబేరులు గత రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం సంపద, ప్రపంచ జనాభాలో మిగిలిన వారు ఆర్జించిన సంపాదిఇంచినదానితో పోలిస్తే దాదాపు రెట్టింపు ఉందని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. ప్రపంచంలో 170 కోట్ల మంది వేతనాలు ద్రవ్యోల్బణం కంటే దిగువన ఉన్నాయని, బిలియనీర్ల సంపద రోజుకు 2.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరుగుతోందని పేర్కొంది. ప్రపంచంలోని మల్టిd మిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే 1.7 ట్రిలియన్‌ డాలర్లతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయవచ్చు. 2020 తరువాత జరిగిన 42 ట్రిలియన్‌ డాలర్ల సంపద సృష్టిలో 66.7 శాతం కేవలం ఒక శాతం మంది సంపన్నులే ఆర్జించారు. గత పది సంవత్సరాల్లో వచ్చిన మొత్తం సంపదలో సగానికి పైగా వీరి చేతుల్లోనే ఉంది.
ప్రపంచంలో ఆకలితో ఉన్న జనాభాలో 60 శాతం మంది మహిళలు, బాలికలేనని నివేదిక స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అసమానతలు భారీగా పెరుగుతున్నాయని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొన్న విషయాన్ని నివేదిక గుర్తు చేసింది. ధనవంతులకు, కార్పొరేట్లకు దశబ్దాలుగా ఇస్తున్న పన్ను తగ్గింపుల వల్లే అసమానతలు భారీగా పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ధనికులు, బిలియనీర్లు చెల్లిస్తున్న పన్ను కంటే పేదలే ఎక్కువ చెల్లిస్తున్నారని పేర్కొంది. తగిన చర్యలు తీసుకోకుంటే ఈ అసమానతలు మరింతగా పెరుగుతాయని ఆక్స్‌ ఫామ్‌ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement