Friday, May 17, 2024

ఇండియాలోనే ఐఫోన్‌ ధర ఎక్కువ.. పన్నులే 41,193 రూపాయలు

యాపిల్‌ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సారి ప్రత్యేకంగా ఇండియాలో తయారైన ఐఫోన్‌ మోడల్స్‌ను కూడా విక్రయానికి పెట్టింది. ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల ధరలు అమెరికా, దుబాయ్‌ కంటే మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో తయారైన ఫోన్లు కూడా అంతర్జాతీయ మార్కెట్‌ కంటే మన దేశంలోనే ఎక్కువ రేటు ఉన్నాయి.

దేశంలోకి దిగుమతి చేసుకునే ఐఫోన్లపై 18 శాతం జీఎస్టీతో పాటు, 22 శాతం సుంకాలను ప్రభుత్వం విధిస్తోంది. ఫలితంగా ఐఫోన్లు అమెరికా, దుబాయ్‌ వంటి దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ రేటు ఉన్నాయి.

ఇండియాలో ఐఫోన్‌ ధరలు…

- Advertisement -

ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ధర ఇండియాలో 1,59,900 రూపాయలుగా నిర్ణయించారు. ఇదే ఫోన్‌ ధర అమెరికాలో 1,599 డాలర్లుగా నిర్ణయించారు. డాలర్లను ఇండియ రూపాయలకు మార్చితే ఈ ధర 1,32,717 రూపాయలు అవుతుంది. కాని మన దేశంలో దీని ధర అమెరికాతో పోల్చితే 51 శాతం అధికంగా ఉంది. మ్యాక్స్‌ ఫోన్‌పై 18 శాతం జీఎస్టీ కోసం 24,39.53 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

22 శాతం డ్యూటీకి 24,435.95 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం పన్నుల రూపంలో 48,827.48 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో దిగుమతి చేసుకునే ఫోన్లపై జీఎస్టీతో పాటు అదనంగా 20 శాతం కస్టమ్స్‌ డ్యూటీ, 2 శాతం సెస్‌లు విధిస్తారు. ఇండియాలోనే తయారైన ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ ధర ఇండియాలో 79,900 రూపాయలుగా ఉంది.

అదే అమెరికాలో 799 డాలర్లు అంటే మన రూపాయల్లో ఇది 66,317 గా ఉంది. దుబాయ్‌లో దీని ధర 3,399 ఏఈడీగా ఉంది. ఇది మన దేశ రూపాయల్లో 76,817 రూపాయలుగా ఉంది. మన దేశంలో తయారైన బేస్‌ మోడల్‌ ఫోన్‌ దుబాయ్‌లో కూడా మన కంటే తక్కువగానే ఉంది. ఐఫోన్‌ 15 ప్రో ఇండియాలో 1,34,900 ధరగా నిర్ణయించారు. ఇదే అమెరికాలో 999 డాలర్లుగా ఉంది.

ఇది మన రూపాయల్లో 82,917 రూపాయలు అవుతుంది. దుబాయ్‌లో 4,299 ఏఈడీగా నిర్ణయించారు. ఇది మన రూపాయల్లో 97,157 అవుతుంది. ఐఫోన్‌ అన్ని మోడల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఐఫోన్‌ ప్రో కొనుగోలు చేసే కస్టమర్లు మన దేశంలో జీఎస్టీ రూపంలో 20,577.97 రూపాయలు, కస్టమ్స్‌ డ్యూటీ, సెస్‌ కలిపి 20,615.45 రూపాయలు మొత్తం 41,193.42 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ల ఆయా దేశాల పన్నులు, ఇతర డ్యూటీల ఆధారంగా మారుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement