Friday, May 10, 2024

ఫ్యాన్సీనెంబర్లకు పెరుగుతున్న క్రేజ్‌.. నంబ‌ర్ కు 21.60 లక్షలు రికార్డు ధ‌ర‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: ఫ్యాన్సీనెంబర్లకు రోజురోజుకు క్రేజీ పెరుగుతోంది. ఖైరతాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు ద్వారా మంగళవారం ఒక్కరోజే రూ.53,34,894 రావడం రికార్డు. టీఎస్‌ 09 జీసీ 9999 నెంబర్‌కు రూ.21,60,000లకు బిడ్డింగ్‌లో పాల్గోని ప్రైమ్‌ సోర్స్‌ గ్లోబల్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.

ఇంతవరకు ఒక నెంబర్‌కు ఇంత పెద్దమొత్తంలో రావడం రవాణా శాఖలో రికార్డుగా నిలిచింది. టీఎస్‌ 09 జీడీ 0009 నెంబర్‌ను రూ.10,50,000కు మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్ర క్చర్స్‌ దక్కించుకోగా, టీఎస్‌ 09 జీడీ 0001 నెంబర్‌ను రూ.3 లక్షల ఒక వెయ్యికి ఆంధ్ర ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇండస్ట్రీ స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది.

టీఎస్‌ 09 జీడీ 0006 నెంబర్‌ను లక్షా 83వేలకు గోయాజ్‌ జెవెలర్స్‌ వారు దక్కించుకున్నారు. టీఎస్‌ 09 జీడీ 0019 నెంబర్‌ను లక్షా 70వేల ఒక వంద రూపాయలకు సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకోగా, టీఎస్‌ 09 జీడీ 0045 నెంబర్‌ను లక్షా 55 వేలకు సాయిపృథ్వీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ దక్కించుకుంది.

టీఎస్‌ 09 జీడీ 0007 నెంబర్‌ను లక్షా 30వేలకు ఫినోక్స్‌ఫర్ట్స్‌ అడ్వయిజరీ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు దక్కించుకున్నారు. టీఎస్‌ 09 జీడీ 0027 నెంబర్‌ను లక్షా 4వేల 999 రూపాయలకు శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్‌ వారు దక్కించుకున్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్‌లో వాహనదారులు పెద్ద మొత్తంలో బిడ్డింగ్‌లో పాల్గొనడం ఫాన్సీ నెంబర్లకు రోజురోజుకు పెరుగుతున్న క్రేజీకి అద్దం పడుతుంది. ఒక కార్యాలయంలో ఒక్క రోజే ఫ్యాన్సీ నెంబర్ల కోసం రూ.53 లక్షలకు పైగా ఆదాయం సమకూరడం ఇప్పటి వరకు సంస్థలో రికార్డుగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement