Sunday, April 28, 2024

EC | ఓటరుగా పేరు ఎంట్రీకి రేపటితో ముగియనున్న గడువు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. 2006 మార్చి 31లోపు జన్మించిన వారెవరైనా కొత్త ఓటు పొందేందుకు అర్హులుగా అధికారులు చెబుతున్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి అనుబంధ ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ఇంటి నుంచే నమోదు చేసుకోవచ్చు

ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి ఏ కార్యాలయానికి, అధికారి వద్దకో తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఓటు హక్కు పొందడానికి పూర్తి వివరాలు, ఫటో, పుట్టిన తేదీని నిర్ధారించే పత్రాలు, చిరునామా, ఆ చిరునామాలో ఉంటున్నట్టుగా నిర్ధారించే పత్రాల (డిజిల్‌ ఫార్మాట్‌లో ఉండాలి)తో ఇంటి వద్ద ఉంటూనే ఓటు నమోదు చేసుకోవచ్చు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఫారం 6ను ఎంచుకోవాల్సి ఉంటుందని అధిఆరులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement