Sunday, April 28, 2024

kanguva రిలీజ్ పై లేటెస్ట్ అప్‌డేట్‌…

తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘కంగువా’. డైరెక్టర్ శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. కాగా, తాజాగా కంగువ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇస్తూ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా 2024లోనే విడుదల అవుతుందని స్పష్టం చేశారు. అయితే రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా రిలీజ్‌ పోస్టర్‌ మాత్రం చాలా ఆసక్తిని పెంచుతుంది. ఇందులో సూర్య మోడ్రన్‌ మనిషిలా, మరోవైపు యుద్ధవీరుడిలా కనిపించాడు. ఈ రెండు పాత్రలను ఎదురేదురుగా చూపిస్తూ డిజైన్‌ చేసిన పోస్టర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement