Saturday, April 27, 2024

కాశ్మీర్‌, ఈశాన్య ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ అవసరంలేని రోజు వస్తుంది.. 83వ రైజింగ్‌ డే పరేడ్‌లో అమిత్‌షా

దేశంలోని అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌) సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. ఢిల్లి వెలుపల తొలిరాసి సీఆర్‌పీఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌ను శనివారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్‌ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు. రాబోయే సంవత్సరాలలో జమ్ము-కాశ్మీర్‌తోపాటు ఈశాన్య ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాల అవసరం ఉండదని చెప్పారు. కాశ్మీర్‌లో భారీ భద్రత మోహరింపును తొలగిస్తామని, కొన్ని సంవత్సరాల్లో ఇది నెరవేరుతుందని కేంద్రంలోని అత్యున్నతస్థాయి ప్రకటించడం ఇదే తొలిసారి. కాశ్మీర్‌తోపాటు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో బలగాల మోహరింపు అవసరం సమీపకాలంలో ఉండకపోవచ్చు. ఈ విషయంలో నాకు దృఢమైన విశ్వాసం ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో శాంతిభద్రతలు నెలకొంటాయి. ఇదే జరిగితే, ఇందుకు పూర్తి ఘనత సీఆర్‌పీఎఫ్‌కే దక్కుతుంది. కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి.

మిలిటెన్సీ, శాంతిభద్రతలను ఎదుర్కోవడానికి దాని మొత్తం మానవీయ శక్తిలో నాలుగింట ఒక వంతు ఈ ప్రాంతంలో మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌, జమ్ము-కాశ్మీర్‌ పోలీసులతోపాటు, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ దళాలు కూడా ఉగ్రవాదం, శాంతిభద్రతల విధులకోసం ఇక్కడ మోహరిం చాయని అమిత్‌షా వివరించారు. పాకిస్తాన్‌ ప్రాయోజిక ఉగ్రవాదంపై పోరును కేంద్ర బలగాలు నిర్ణయాత్మక నియంత్రణగా సీఆర్‌పీఎఫ్‌ చేపట్టిందని, ఇది జమ్ము-కాశ్మీర్‌లో చేపట్టిన అతిపెద్ద విధి అని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భద్రతబలగాలు ఉగ్రవాదంపై నిర్ణయాత్మక నియంత్రణ కలిగివుండటం అతిపెద్ద విజయంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితి మెరుగుపడిందన్న అమిత్‌షా, అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం గురించి, కేంద్రపాలిత ప్రాంతంలో రూ. 33 వేల కోట్ల పెట్టుబడుల గురించి ప్రస్తావించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement