Friday, April 26, 2024

ఉద్దేశపూర్వకంగానే సీఎం అన్నారని కాంగ్రెస్‌ నేతల ఫైర్.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు

రష్యా ఉక్రెయిన్‌ ఆక్రమించినట్లుగానే కేంద్రం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ప్రయత్నిస్తున్నదని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. అయితే, ఎంతటి వత్తిడులు వచ్చినా… కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సాగిలపడేది లేదని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్‌ కేంద్రంపై ఘాటుగా స్పందించారు. రష్యాను ఉక్రెయిన్‌ ఎలాగైతే మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నదో… తాను అంతకంటే తీవ్రంగా కేంద్రానికి బుద్ధి చెప్పగలనని సోరెన్‌ స్పష్టం చేశారు.

జార్ఖండ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరంపాలు చేయడానికి అబద్ధపు ప్రచారాలకు కేంద్రం పూనుకుంటున్నదనీ, ఇందుకోసం కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్‌ను ఒక్క రోజులోనే పడగొడతానని రష్యా బీరాలకు పోయింది.. వాస్తవంగా ఇప్పుడక్కడ ఏం జరుగుతున్నదో ప్రపంచమంతా చూస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాలతో ప్రభుత్వాలను కూల్చాలనుకోవడం బుద్ధితక్కువతనం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement