Monday, April 15, 2024

Delhi: ఐదో విడత చర్చలకు.. రైతులను ఆహ్వానించిన కేంద్రం

ఢిల్లీ: అన్నదాతలు మరోసారి ఢిల్లీ చలో మార్చ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో చర్చల కోసం కేంద్రం మరోసారి వారిని ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు.

ఇప్పటికే నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. ఎంఎస్పీ, పంటల వైవిధం, పంట వ్యర్థాల సమస్య, ఎఫ్ఐఆర్ అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందువల్ల మరోసారి రైతు నేతలతో చర్చించేందుకు ఆహ్వానిస్తున్నామని ట్విట్టర్ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement