Sunday, May 5, 2024

ఎన్నిక‌ల సంఘాన్ని ర‌ద్దు చేయాల్సిందే – ఉద్ద‌వ్ థాక్రే

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రజల ద్వారానే దానిని ఎన్ను కోవాలని సూచించారు. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై ఆయన మరోసారి మండిపడ్డారు. సోమవారం మీడియాతో ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు. ఒక అధికార పార్టీ పేరు, చిహ్నాన్ని నేరుగా ఒక వర్గానికి ఇచ్చిన సందర్భం ఇప్పటి వరకు లేదన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండగా ఈసీ తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాముడి ధను స్సును రావణుడు పట్టుకోలేడంటూ పరోక్షంగా షిండే వర్గంపై ధ్వజమెత్తారు. అవతలి వర్గం శివసేన పేరు, గుర్తు తీసుకోవచ్చు. కానీ థాక్రే పేరును తీసుకోలేరు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ‘బాలాసాహబ్‌ థాక్రే కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. కేంద్రం స హాయంతో వారు థాక్రే వారసత్వాన్ని పొందలేరు’ అని హెచ్చరించారు. దొంగలు తన ఇంట్లోకి చొరబడి అన్నీ దోచుకున్నారంటూ షిండే వర్గాన్ని నిందించారు. ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు.

దమ్ముంటే నీ తండ్రి పేరుతో గెలువు..
ఏక్‌నాథ్‌ షిండేకు దమ్ముంటే తన తండ్రి బాలా సాహబ్‌ థాక్రే పేరును వదిలేసి వచ్చే ఎన్నికల్లో ఆయన తండ్రి పేరుతో గెలువాలని సవాల్‌ చేశారు. పార్టీ ప్రస్తుతం రెండు వర్గాలుగా విడి పోయి ఉందని, వాటికి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తి ంపు కూడా ఉన్నదని, ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకునే వాళ్లు (ఏక్‌నాథ్‌ షిండేవర్గం) పార్టీ పేరును, గుర్తును దక్కించుకున్నారని ఉద్ధవ్‌ చెప్పారు.
ఈసీ నిర్ణయంపై సుప్రీంకు ఉద్ధవ్ బాల్‌థాక్రే స్థాపించిన శివసేన పార్టీకి చెందిన పేరు, ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉద్ధవ్‌ థాక్రే సుప్రీంలో సవాల్‌ చేశారు. ఏక్‌నాథ్‌ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించడం, ‘విల్లు-బాణం’ గుర్తును వారికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్‌ వర్గం ఆక్షేపించింది. దీనిని సవాలు చేస్తూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయంచింది. ఈ కేసును షెడ్యూల్‌ లేకుండా అత్యవసర విచారణ చేపట్టాలని థాకరే వర్గం తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇందుదు సీజేఐ డీవై చంద్రచూడ్‌ నిరాకరిం చారు. సరైన పేపర్‌ వర్క్‌తో మంగళవారం అత్యవసర జాబితాలో ప్రవేశపెట్టాలని సూచించారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత, దాదాపు ఎనిమిది నెలల హడ్రామాకు ఈసీ గత శుక్రవారం తెరదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement