Wednesday, May 15, 2024

టెక్స్ టైల్ మిల్లులో – భారీ అగ్నిప్ర‌మాదం-భారీగా ఆస్తి న‌ష్టం

ఓ టెక్స్ టైల్ మిల్లులో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. సూరత్‌లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ టెక్స్‌టైల్‌ మిల్లులో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement