Sunday, May 5, 2024

న్యూజిలాండ్ లో భారీ అగ్నిప్రమాదం – 10 మంది సజీవ దహనం

.న్యూజిలాండ్ వెల్లింగ్‌టన్‌ లోనీ నాలుగు అంతస్తుల హాస్టల్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్ వెల్లింగ్‌టన్‌లో మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.హాస్టల్‌లో మొత్తం 92 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భయంతో వీరంతా బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు 52 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.

కాగా.. అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సంఖ్య 10 దాటి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక కచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు.. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్‌లో స్ప్రింక్లర్స్ లేవని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement