Saturday, March 16, 2024

SunNXTలో ‘ఏజెంట్ కన్నయిరం’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌..

నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా తెలుగులో అత్యుత్తమ డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్‌లలో ఒకటిగా స్థానం సంపాదించుకంది. కాగా, ఈ సినిమా తమిళంలో ‘ఏజెంట్ కన్నయిరం’ పేరుతో రీమేక్ అయింది, ఇందులో హాస్యనటుడు సంతానం ప్రధాన పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తు, తమిళ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. భారీ డిజాస్టర్ గా మారింది.

థియేట్రికల్ రన్ పూర్తైన తరువాత, ఈ సినిమా SunNXTలో ప్రసారం అవుతోంది. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలుగు సూపర్‌హిట్ అయిన సినిమాని.. తమిళ రీమేక్ అయిన ఈ సినిమా మళ్లీ తెలుగులోకి డబ్ చేయబడింది. ఇక ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్ కూడా ఇప్పుడు SunNXTలో ప్రసారం అవుతోంది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. మనోజ్ బీద దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రియా సుమన్, శృతి హరిహరన్ మరియు రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement