Saturday, December 7, 2024

Mumbai | డ్రగ్​ ఓవర్​డోస్​.. టీవీ నటుడు ఆదిత్యసింగ్​ రాజ్​పుత్​ మృతి

నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ డ్రగ్​ ఓవర్​ డోస్​తో ఇవ్వాల (సోమవారం) చనిపోయాడు. ముంబైలోని అంధేరిలో తన స్నేహితుడి బాత్‌రూమ్‌లో శవమై కనిపించినట్టు తెలుస్తోంది. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. తన రూమ్మేట్ ఉదయం ఇంటికి చేరుకున్నప్పుడు రాజ్‌పుత్ బాత్రూంలో నేలపై పడి ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత వాచ్‌మెన్ సహాయంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, రాజ్‌పుత్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఆదిత్యసింగ్​ రాజ్​పుత్​ అంధేరీ లోఖండ్‌వాలాలోని లష్కరియా హైట్స్ అనే భవనంలో రూమ్‌మేట్‌తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement