Thursday, April 25, 2024

Big Story | తలసరిలో తెలంగాణకు సరిలేరు.. ఇత‌ర రాష్ట్రాల తీరు అంతంతే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అన్ని రంగాల్లో వర్ధిళ్లుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతికి జిల్లాలు సైతం ఊతంగా నిలుస్తున్నాయి. ఇక కీలకమైన తలసరి ఆదాయంలో తెలంగాణ సత్తా చాటుతోంది. దేశానికే టార్చ్‌ బేరర్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నుల అందజేతలోనూ,. ఆర్ధికంగా ఎదుగుదలలోనూ మకుటాయమానంగా నిలుస్తోంది. తలసరిలో ఇంటర్నేషనల్‌ సిటీ గ్రేటర్‌ #హదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకోగా.. జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా దేశ వాణిజ్య రాజధాని ముంబాయిని అధిగమించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా తొమ్మిదేళ్ళపాటు అత్యధిక ఆదాయం, ఆర్థిక వృద్ధిరేటులో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

ప్రస్తుత ఆర్ధిక యేడాది 2022-23లో రూ.3,08,732 గా నమోదైంది. అదే సమయంలో మిగతా రాష్ట్రాలన్నీ రూ.2లక్షల లోపే ఉన్నాయి. జాతీయ స్థూల ఆదాయ వృద్ధిరేటులో పెద్ద రాష్ట్రాలకు మించి ముందుకు సాగుతున్న రాష్ట్రం సొంత ఆదాయ వనరుల వృద్ధి (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ)పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తలసరిలో రంగారెడ్డి జిల్లా రూ.6.59 లక్షలు, హైదరాబాద్‌ రూ.3.51లక్షలు, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి రూ.2.40లక్షలతో మొదటి వరుసలో నిల్చాయి. జీఎస్‌డీపీలో రూ.1,24,871 కోట్లతో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1,21,375 కోట్ల ఉత్పత్తితో హైదరాబాద్‌ జిల్లా రెండోస్థానంలో ఉంది. కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లా రూ.3,838 కోట్ల స్థూల ఉత్పత్తితో ఆఖరు స్థానంలో ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నమోదైన స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి విలువ అన్ని జిల్లాలు కలుపుకుని రూ.7,53,127 కోట్లుగా ఉంటే, ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2018-19 నాటికి రూ.6,12,828 కోట్లకు తగ్గింది.

అనేక అంతర్జాతీయ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో హైహదరాబాద్‌కు తరలి వస్తుండటంతో మహానగరం ఉపాధికి కేంద్రంగా మారుతున్నది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజల తలసరి ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. అదేవిధంగా జీఎస్డీపీలో పెద్దన్న పాత్ర పోసిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైనే మించిపోగా, దేశంలోని కొన్ని ప్రధాన నగరాలకన్నా హైదరాబాద్‌ ముందంజలో నిల్చింది.

- Advertisement -

దేశ సగటు కన్నా ఎక్కువ…

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు, ప్రజల సందప పెంచే చర్యలు, ఉపాధి కల్పన, అవినీతి రహిత విధానాలు, సరికొత్త పాలసీలవంటి తదితర రాష్ట్ర ప్రభుత్వ ప్రజానుకూల విధానాల ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం 8 ఏండ్లలోనే రెట్టింపైంది. 2020-21లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 2.79 లక్షలుగా నమోదైంది. కాగా జాతీయ సగటు రూ. 1.27 లక్షలు మాత్రమే. టీఎస్‌డీపీఎస్‌ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.6.59 లక్షలు ఉంటే.. కనిష్ఠంగా వికారాబాద్‌ జిల్లాలో రూ.1.32 లక్షలుగా ఉన్నది. ముఖ్యంగా గ్రేటర్‌ #హదరాబాద్‌, పరిసర జిల్లాల పరిధిలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. రంగారెడ్డి తరువాత #హదరాబాద్‌ జిల్లా రూ.3.51 లక్షలతో రెండో స్థానంలో ఉన్నది.

అన్ని రంగాల్లోనూ ఇదే ఒరవడి…

దేశ చరిత్రలో ఇప్పటివరకూ దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని ముంబైలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉండేది. ముంబైలో తలసరి ఆదాయం రూ.6.43 లక్షలు కాగా.. రంగారెడ్డి జిల్లా రూ. 6.59 లక్షలు దానిని అధిగమించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలను దాటి రంగారెడ్డి జిల్లా దూసుకుపోయింది. గడచిన ఆరేడు సంవత్సరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఐటీ రంగంలో ఎగుమతులు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. పారిశ్రామికంగా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులతో తరలివచ్చాయి.

అదేవిధంగా ఆఫీస్‌ స్పేస్‌లో సైతం అంతర్జాతీయ నగరంగా ఖ్యాతిగడించిన హైదరాబాద్‌ దేశంలోని అనేక ఇతర మెట్రో నగరాలను మించిపోయింది. అత్యంత జీవనయోగ్యమైన నగరాలలో హైదరాబాద్‌కు వరుసగా ఐదుసార్లు అవార్డులు వచ్చాయి. కరోనా అనంతరం రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లి ఊపందుకోవడంతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు, రోడ్లు, మెట్రో రైలు వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఫలితంగా నగరానికి రాకపోకలు, ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, సరిహద్దుల్లోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలు కూడా తలసారి ఆదాయంలో వృద్ధి రేటును కొనసాగించాయి.

జిల్లాలవారీగా తలసరి ఆదాయం (రూ.లక్షల్లో….

జిల్లా తలసరి ఆదాయం
రంగారెడ్డి 6.59

హద్రాబాద్‌ 3.51

మేడ్చల్‌మ్ఖల్కాజ్‌గిరి 2.40
మెదక్‌ 2.30
మహబూబ్‌నగర్‌ 2.23
యాదాద్రి భువనగిరి 2.22
సిద్దిపేట 2.19
జయశంకర్‌ భూపాలపల్లి 2.14
సంగారెడ్డి 2.05
నల్లగొండ 2.01
కరీంనగర్‌ 1.91
సూర్యాపేట 1.84
భద్రాది కొత్తగూడెం 1.83
ఖమ్మం 1.83
నిర్మల్‌ 1.79
అదిలాబాద్‌ 1.75
వరంగల్‌ రూరల్‌ 1.76
జనగామ 1.75
పెద్దపల్లి 1.74
ములుగు 1.68
నాగర్‌కర్నూల్‌ 1.63
నిజామాబాద్‌ 1.67
రాజన్న సిరిసిల్ల 1.56
కామారెడ్డి 1.55
మంచిర్యాల 1.55
మ#హబూబాబాద్‌ 1.53
వనపర్తి 1.51
జోగులాంబ గద్వాల 1.50
జగిత్యాల 1.50
నారాయణపేట్‌ 1.43
వరంగల్‌ 1.38
కొమ్రంభీమ్‌ 1.37
వికారాబాద్‌ 1.32

Advertisement

తాజా వార్తలు

Advertisement