Thursday, February 29, 2024

డబ్ల్యూటీసీ ఫైనల్​కు జట్టు ఎంపిక.. రేపు ఇంగ్లండ్ కు ఇండియా జట్టు

ఈ ఏడాది ఐపీఎల్ 16వ సీజ‌న్ చివరి స్టేజ్ కి వచ్చేసింది. ఇక క్రికెట్ ల‌వ‌ర్స్ దృష్టి ఐపీఎల్ నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ వైపు మ‌ర్ల‌నుంది. జూన్ 7వ తేదీ నుంచి ఓవల్ సీస్ లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. దీనికోసం టీమిండియాలోని కొందరు ప్లేయర్స్ రేపు (మంగళవారం) సాయంత్రం 4.30 సమయంలో ఇంగ్లండ్ కు వెళ్లనున్నట్లు స్పోర్ట్స్ స్టార్ తన రిపోర్టులో వెల్లడించింది. తొలి విడతగా 8 మంది ప్లేయర్స్ ఇంగ్లండ్ ఫ్లైటెక్కనున్నారు.

కాగా, ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు డిస్ క్వాలిఫై అయిన‌ టీమ్స్ లోని కొంద‌రు ప్లేయర్స్ ఈ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆదే టీమ్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ కూడా వీళ్లలో ఉన్నారు. వీరితో పాటు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్లు ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్ ఈ బ్యాచ్ లో ఉన్నారు. ఈ ఏడుగురితోపాటు రిజర్వ్ ప్లేయర్స్ లో ఉన్న ముకేశ్ కుమార్ కూడా ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.

అయితే.. చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్ లో ఉన్నాడు. అతడు ససెక్స్ టీమ్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక వీళ్లు కాకుండా ప్ర‌స్తుతం ప్లేఆఫ్స్ పాస్ అయ్యి.. క్వాలిఫైర్ రౌండ్స్ ఆడ‌నున్న‌ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమి, కేఎస్ భరత్, అజింక్య రహానే ఉన్నారు. వీళ్లు ఐపీఎల్ ముగిసిన తర్వాత సెంకండ్ బ్యాచ్ లో ఇంగ్లండ్ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement