Monday, April 29, 2024

టాటా మోటార్స్‌ రికార్డ్‌ లాభాలు.. నికర లాభం 3,203 కోట్లు

ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ టాటా మెటార్స్‌ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 3,202 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ 5,006.6 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో పోల్చితే నికర లాభం 40.7 శాతం తగ్గింది. ఆ త్రైమాసికంలో కం పెనీకి 5,407.79 కోట్లుగా ఉంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 42.6 శాతం పెరిగి 1,01,528.49 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 7,227.76 కోట్లుగా ఉంది. కంపెనీ ఖర్చులు గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 77,783.69 కోట్లుగా ఉంది.

ఈ త్రైమాసికంలో ఖర్చు 98,266.93 కోట్లుగా ఉందని టాటా మోటార్స్‌ తెలిపింది. వాణిజ్య వాహనాల ద్వారా వచ్చే ఆదాయం 4.4 శాతం పెరిగి 17 వేల కోట్లుగా ఉంది. దేశీయంగా టోకు అమ్మకాల్లో 14.4 శాతం క్షీణతను కంపెనీ నమోదు చేసింది. ఇదే సమయంలో మార్కెట్‌లో నెలకొన్ని ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఎగుమతులు 32 శాతం తగ్గాయని తెలిపింది. ప్రయాణికుల వాహనాల ద్వారా వచ్చే ఆదాయం 11 శాతం పెరిగింది. దేశీయంగా జరిగే హోల్‌సేల్‌ అమ్మకాలు 7.5 శాతం పెరిగినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement