Friday, April 26, 2024

ద్ర‌విడ దెబ్బ‌కు జాతీయ పార్టీలు విల‌విల‌..

తమిళనాట బెడిసికొట్టిన జాతీయ పార్టీల వ్యూహాలు
కొద్దిసీట్లతో సరిపెట్టుకున్న భాజపా, కాంగ్రెస్‌

చెన్నై, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ద్రావిడ రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయ లలితల మరణానంతరం జరుగుతున్న ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముద్ర చూపేందుకు జాతీయ పార్టీలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా చక్రం తిప్పుతున్న బీజేపీతో పాటు తమిళ రాజకీయాల్లో కాస్తోకూస్తో పట్టున్న కాంగ్రెస్‌ కూడా ఈసారి మిత్రపక్షాలు విదిల్చిన సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కొద్దిపాటి సీట్ల నుంచి బరిలో దిగేందుకు కూడా ఈ రెండు పార్టీలకు బలమైన అభ్య ర్థులు లభించడం లేదు. తమిళ రాజకీ యాల్లో ద్రావిడ ప్రభావం మొదలైన అనం తరం అన్నాదురై, ఎంజీఆర్‌, కరుణానిధి, జయల లి తలు గత నాలుగు దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్ని శాసించారు. ఆ కాలంలో జాతీయ పార్టీలు తమిళనాట ప్రవేశించలేక పోయాయి. కాంగ్రెస్‌ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేసినా ప్రతి ఎన్నికల్లో ఏదొక ద్రావిడ పార్టీకి చేరబడి కొద్దిపాటి సీట్లను పొందేందుకే పరిమితమైంది. ఈ సారి కరుణానిధి, జయలలిత ఇద్దరూ లేకపోవడంతో తమిళ రాజకీయాల్లో పాగా వేయాలని బీజేపీ చూసింది. వాస్తవానికి జయలలిత మరణానంతరం తమిళనాట అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని వెనుకుండి బీజేపీ పెద్దలే నడిపిం చారు. పేరుకు పళనిస్వామి ముఖ్య మంత్రి అయినా ఆదేశాలన్నీ బీజేపీ అధిష్టానం నుంచే వెలువడ్డాయి. పరోక్షంగా అమిత్‌షా తమిళ ప్రభుత్వంలో పెత్తనం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్షంగానే అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్ళూ రింది. ఇందుకోసం పలు రకాల వ్యూహాల్ని అమలు చేసింది. శశికళ తిరిగి అన్నా డీఎంకే పగ్గాలు చేపడితే బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు ఉండవని అంచనా లేసింది. ఆమెపై ఉన్న ఆర్థిక నేరాల్ని ఆసరాగా తీసుకుని ఆమెను రాజకీయా ల నుంచి తప్పు కునేలా చేసింది.మరోవైపు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంల మధ్య సయోధ్య కుది ర్చింది. శశికళకు అన్నా డీఎం కేలో ద్వారా లు మూసుకు పోయేలా వ్యూహా ల్ని అమలు చేసింది. శశికళ లేకుంటే పరొ క్షంగా అన్నాడీ ఎంకే తమ గుప్పెట ఉంటుం దని ఆ పార్టీ ఆశిం చింది. తీరా చూస్తే సీట్ల పంప కం విషయంలో బీజేపీకి భంగపాటు తప్పలేదు.
మొత్తం 234 అసెంబ్లిd సీట్లకు గాను బీజేపీకి 20కి మించి ఇచ్చేది లేదు పొమ్మంటూ అన్నాడీఎంకే అధిష్టానం తేల్చేసింది. దీంతో ఇప్పుడు కూటమిలో ప్రధాన భాగస్వా మైనప్పటికీ రాష్ట్రంలో బీజేపీ పోటీ పరిమితంగానే మారింది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కరుణానిధి లేని డీఎంకేపై మరింత పెత్తనం చేసేందుకు ప్రయత్నించింది. కానీ స్టాలిన్‌ ఆ ప్రయత్నాల్ని సాగనివ్వ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తు కారణం గా తము నష్టపోయామన్న అభిప్రాయం డీఎంకే లో ఏర్పడింది. గతంలో ఆ పార్టీకిచ్చిన సీట్లలో నాలుగో వంతు నుంచి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందలేక పోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఇచ్చిన 41 సీట్లను ఈ సారి 25కి తగ్గించారు. దీంతో కాంగ్రెస్‌ కినుక వహించింది. అయినా డీఎంకే పట్టించు కోలేదు. కూటమిలో ఉన్నా వదిలెళ్ళినా ఇబ్బందిలేదన్న రీతిలో వ్యవహరించింది. దీంతో ఇచ్చిన కాడికే కాంగ్రెస్‌ బరిలో దిగేందుకు సమాయత్తమౌతోంది.
ఈ సారి ఎన్నికల్లో అన్నాడీఎంకే 177 సీట్ల నుంచి పోటీ చేస్తోంది. డీఎంకే 173 సీట్ల నుంచి బరిలో దిగుతోంది. రెండు కూట ముల్లోనూ సీట్ల బేరం కోసం వారాల తరబడి చర్చలు జరిగాయి. కానీ డీఎంకే, అన్నాడీ ఎంకేల దయమీదే ఇప్పుడా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు సీట్లు పొందగలిగాయి. మొదటి నుంచి తమిళ రాజకీయాలు విభిన్నంగా ఉం టాయి. ఆ రాష్ట్రంలో మాతృభూమిని, మాతృ భాషను గౌరవి స్తారు. ద్రావిడ ఉద్య మానికి ప్రజలు కట్టుబడుంటారు. జాతీయత భావా లు, జాతీయ పార్టీలంటూ ఎంతగా రెచ్చ గొట్టినా వారు స్పందించరు. స్థానిక నాయక త్వాన్ని, పార్టీల్నే విశ్వసిస్తారు. ఇదే డీఎంకే, అన్నాడీఎంకేలకు బలం. దీన్ని చూసుకునే ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీల్ని సైతం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కనీసం ఈ సారైనా పెద్దసంఖ్యలో బరిలో దిగే అవకాశముంటుందని ఆశించిన బీజేపీ, కాంగ్రెస్‌లకు తిరిగి భంగపాటు తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement