Friday, July 26, 2024

T20WC | ఉత్కంఠ పోరులో బంగ్లాపై సౌతాఫ్రికా విజ‌యం..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తక్కువ స్కోరును అద్భుతంగా డిఫెండ్ చేసి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ ముందు 114 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్వల్ప లక్ష్య ఛేదినలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తక్కువ లక్ష్యంతో ఛేజింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ షాక్ ఇచ్చాడు. 6 బంతుల్లో 11 పరుగులు అవసరమైనప్పుడు కేవలం ఆరు పరుగులు మాత్రే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపుకు తిప్పేసాడు. దీంతో ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ విజయంతో ఆరు పాయింట్లు సాధించిన దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement