Wednesday, July 10, 2024

T20 WC | టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లా..

టీ20 ప్రపంచ కప్‌-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. కాగా, అంటిగ్వా వేదికగా జరుగుతున్న తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్‌ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుని భార‌త్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

అయితే, ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్‌ సేన వ్యూహాలు రచిస్తుంటే.. బంగ్లాదేశ్‌ సైతం భారత్‌ను ఓడించి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

తుది జట్లు :

భార‌త్ : రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (సి), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా రియాద్, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement