Sunday, October 6, 2024

Crazy Fello | జైలు తప్పించుకోవడానికి బల్లిని మింగాడు.. యూపీలో రేపిస్ట్‌ అఘాయిత్యం

ఒక టీనేజ్‌ అమ్మాయిని అపహరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి కాన్పూర్‌లో పోలీస్‌ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి జైలుకు వెళ్ళకుండా ఉండటం కోసం బల్లిని మింగాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు నిందితుని భతార్‌గావ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు సిఫార్సు చేయడంతో లాలాలజపతిరాయ్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చెప్పిన ప్రకారం సధ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక గ్రామంలో నివాసం ఉంటున్న అమ్మాయి తండ్రి తమ బంధువుల్లో ఒకామె తన 18 ఏళ్ళ కుమార్తెను ఎక్కడికో తీసుకెళ్ళిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆ తర్వాత సదరు అమ్మాయిని బెంగళూరులో కనిపెట్టారు. ఆదివారం ఆ అమ్మాయిని కాపాడిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా సదరు వ్యక్తి ఫతేపూర్‌ జిల్లాలో కిషన్‌పూర్‌ గ్రామవాసి మహేష్‌ కుమార్‌గా(24) గుర్తించారు. తనను అతడు అపహరించుకొనిపోయి రేప్‌ చేశాడని సదరు అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు మహేష్‌ బల్లిని తిన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement