Friday, February 23, 2024

Love | గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.900 కోట్లు.. వీలునామాలో రాసిన ఇటలీ మాజీ ప్రధాని

ఇటలీ మాజీ ప్రధాని దివంగత సిల్వియో బెర్లుస్కోని తన గర్ల్‌ఫ్రెండ్‌ మార్టా ఫాసినా(33)కు 100 మిలియన్‌ యూరోలు (రూ.900 కోట్లు) అప్పగిస్తూ వీలునామా రాశారు. ఫాసినాను చట్టప్రకారం వివాహం చేసుకోనప్పటికీ మృత్యుశయ్యపై ఉన్న సమయంలో ఆమెను తన భార్యగా బెర్లుస్కోని ప్రస్తావించినట్టు సమాచారం . 2018 సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇటలీ పార్లమెంట్‌ దిగువ సభ సభ్యురాలిగా మార్టా కొనసాగుతున్నారు. బెర్లుస్కోని తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 1994లో ఫోర్జా ఇటాలియా అనే పార్టీని పెట్టారు.

సదరు పార్టీలో సభ్యురాలిగా మార్టా ఉన్నారు. ఇరువురి మధ్య బంధం 2020 మార్చిలో పెనవేసుకుంది. ఇటలీ మాజీ ప్రధాని మొత్తం ఆస్తి విలువ 6 బిలియన్‌ యూరోలపై మాటే. సిల్వియో బెర్లుస్కోని రాసిన విల్లును ఆయన ఐదుగురు సంతానం, ఇతర సాక్షుల సమక్షంలో చదివి వినిపించారు. ఆ విల్లులో ”నా దగ్గరున్న నగదు నిల్వలను నా సంతానం మరినా, పేర్‌ సిల్వియోలకు సమానంగా పంచుతున్నాను. మిగిలిన ఆస్తిని నా ఐదుగురు సంతానం మరినా, పేర్‌ సిల్వియో, బార్బారా, ఎల్యోనోరా, లుయిగిలకు సమభాగాలుగా అప్పగిస్తున్నాను” అని ఇటలీ మాజీ ప్రధాని రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement