Thursday, June 13, 2024

Shadnagar : ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ వాసి అర‌టి అర‌వింద్ యాద‌వ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందాడు. షాద్‌న‌గ‌ర్ బీజేపీ నాయ‌కుడు అర‌టి కృష్ణ ఏకైక కుమారుడు అర‌వింద్.. ఉద్యోగ రీత్యా సిడ్నీలో స్థిర‌ప‌డ్డాడు.ఐదు రోజుల క్రితం త‌న ఇంటి నుంచి వెళ్లిన అర‌వింద్.. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆస్ట్రేలియా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే అర‌వింద్ డెడ్‌బాడీ సముద్రంలో ల‌భ్య‌మైన‌ట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఆ మృత‌దేహం అర‌వింద్‌దేన‌ని పోలీసులు ధ్రువీక‌రించారు.

అత‌డిది హ‌త్యా..? లేక ఆత్మ‌హ‌త్యా..? అన్న కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. గ‌త సోమ‌వారం షాద్‌న‌గ‌ర్‌కు వ‌చ్చేందుకు అర‌వింద్ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయ‌న బంధువులు తెలిపారు. వారం రోజుల క్రిత‌మే అర‌వింద్ త‌ల్లి ఉషారాణి ఆస్ట్రేలియా నుంచి సొంతూరికి వ‌చ్చింది. అర‌వింద్ భార్య గ‌ర్భిణి. కారు వాష్ చేయించుకుని వ‌స్తాన‌ని చెప్పిన అత‌డు తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. చివ‌ర‌కు స‌ముద్రంలో శ‌వ‌మై తేలాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement