Thursday, May 2, 2024

Delhi | ఇసుక తవ్వకాల కేసులో జరిమానాపై సుప్రీం ‘స్టే’.. ఆగస్టులో తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంచయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

ఎన్జీటీ విధించిన రూ. 18 కోట్ల జరిమానాపై ‘స్టే’ కోరడంతో పాటు తీర్పులోని ఇతర అంశాలపై కూడా అప్పీల్ చేసినట్టు తెలిసింది. అయితే జరిమానా అంశంపై తాత్కాలికంగా ఊరటనిచ్చిన ధర్మాసనం మిగతా అంశాలపై ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతనే ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేసులో ప్రతివాదులైన ప్రతివాదులైన  నాగేంద్ర కుమార్, హేమకుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement