Monday, May 6, 2024

విజయ్‌మాల్యాకు సుప్రీంకోర్టు ఫైన‌ల్ వార్నింగ్..

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు అప్పు తీసుకుని విదేశాలకు పరారైన కింగ్‌ఫిషర్స్‌ అధినేత విజయ్‌మాల్యాకు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హాజరు అయ్యేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోగా హాజరుకాకపోతే తదుపతి చర్యలు తీవ్రంగా ఉంటాయని అపెక్స్‌కోర్టు మాల్యాను హెచ్చరించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. 24వ తేదీలోగా విజయ్‌మాల్యా వ్యక్తిగతంగా లేదా ఆయన తరఫున న్యాయవాది కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాకపోతే తామే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా 2017లో మాల్యా కర్నాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ కుమారుడు, కుమార్తెలకు 40మిలియన్‌ డాలర్లను బదిలీ చేశాడు. దీంతో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement