Tuesday, April 30, 2024

Ayodhya: బాల‌రాముడి నుదుటిని తాకిన సూర్య‌కిర‌ణాలు

అయోధ్యలో శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటన సూర్యకిరణాలు ప్రసరించాయి. మూడున్నర నిమిషాల పాటు ఈ అద్భుతం చోటు చేసుకుంది. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యకిరణాలు ప్రసరించాయి.

- Advertisement -

ఏటా శ్రీరామనవమి రోజున ఈ దృశ్యం కనిపించనుంది. భక్తులు సూర్యతిలకాన్ని వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. బాలరాముడిపై సూర్య తిలకం ప్రసరించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వారు.. టీవీలు, సోషల్ మీడియాల్లో చూసిన వారు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఈ మధ్యాహ్నం 12 గంటల 4 నిముషాల సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్య తిలకం ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు చేశారు.ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement